అంబులెన్స్‌లకు నేను కూడా డబ్బులిస్తున్నా: శంభీపూర్ రాజు

by  |
అంబులెన్స్‌లకు నేను కూడా డబ్బులిస్తున్నా: శంభీపూర్ రాజు
X

దిశ, కుత్బుల్లాపూర్ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజును పురస్కరించుకని ప్రభుత్వ వైద్యశాలలకు అంబులెన్సులను అందజేస్తాని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రకటనలు, ఫ్లెక్సీలు పెట్టకుండా గిఫ్ట్ ఎ స్మైల్ కింద సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చేసిన ప్రకటనకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్ రాజు స్పందించారు. ప్రభుత్వవైద్యశాలకు అవసరమైన ఒక అంబులెన్స్ కు అవసరమైన నగదు చెక్కును ఆయన సోమవారం మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ప్రభుత్వానికి ఆరు అంబులెన్స్ లకు అవసరమైన నగదును కేటీఆర్ ఇవ్వడం వల్లే తాను కూడా ఇచ్చానన్నారు.

Next Story

Most Viewed