అప్పుల కుప్పగా తెలంగాణ.. సీఎం కేసీఆర్‌పై సీతక్క ఫైర్

by  |
MLA Sitakka
X

దిశ, ములుగు: బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండలంలోని కాల్వపూర్ గ్రామానికి చెందిన వందమంది కార్యకర్తలు సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని కానీ, కేసీఆర్‌ కుటుంబం మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని, ఉద్యోగాలు లేక రోడ్డునపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నా, లేకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పేదల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల్ల కుమార్ స్వామి, ములుగు జిల్లా ‘దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ కార్యక్రమ ఇన్‌చార్జి కూచన రవళి రెడ్డి, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమన్న, ములుగు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed