అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

by  |
YCp-MLA-1
X

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల కాలంలో రాజకీయాల్లో గోడదూకడాలు అలవాటుగా మారిపోయాయి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం..ఏకంగా మంత్రులు కూడా అయిన దాఖలాలు లేకపోలేదు. అయితే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్తే ఎక్కడ అనర్హులవుతామనో కొందరు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యులను అధికార పార్టీలోకి పంపి వీరు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇవి పరిపాటిగా మారాయి. అయితే జనాగ్రహ దీక్షలో రాజకీయ రహస్యం బట్టబయలైంది. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏకంగా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. ఆ దీక్షకు జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏకంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతలో మీడియా రావడంతో వెంటనే కండువా తీసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed