నిధులు మంజూరు.. కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఏం అన్నారంటే..?

by  |
నిధులు మంజూరు.. కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఏం అన్నారంటే..?
X

దిశ, శంషాబాద్: శంషాబాద్‌లో వెజ్‌ & నాన్ వెజ్ మార్కెట్‌కు నాలుగు కోట్లు మంజూరు చేసినందుకు సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్ నిర్మించుకోవడానికి శంషాబాద్ పట్టణంలో 1 ఎకరా 20 గుంటల ప్రభుత్వ భూమి జాతీయ రహదారి పక్కనే ఉందని, ఆ స్థలంలో మార్కెట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ప్రజలకు రవాణా సౌకర్యం కొరకు ఔటర్ రింగ్ రోడ్డు కూడా దగ్గరే ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్ మున్సిపాలిటీ ప్రజలకు ఎంతో అవసరం ఉందని.. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా మార్కెట్ నిర్మాణానికి ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కోరారు.

Next Story

Most Viewed