ఉద్రిక్తత.. మంత్రి జగదీష్ రెడ్డి మైక్‌ లాక్కున్న కోమటిరెడ్డి

by  |
MLA Komatireddy Rajagopal Reddy, Minister Jagadish Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ రచ్చ రచ్చగా మారింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదస్పద వాతావరణం ఏర్పడింది. కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రోటోకాల్ పాటించలేదంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.

మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం కాదని, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు. అయితే ఈ క్రమంలోనే మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన మైకును లాక్కున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

కేసీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన ఈటల.. సీఎంకు తలనొప్పిగా మారిన హుజురాబాద్.!

ఎమ్మెల్యే ఇల్లు కట్టుకోకూడదా.. సైదిరెడ్డి ఆగ్రహం



Next Story

Most Viewed