ఎమ్మెల్యే జోగురామన్న పుట్టినరోజు… గిన్నిస్ బుక్ ఎక్కాల్సిందే…!

by  |
ఎమ్మెల్యే జోగురామన్న పుట్టినరోజు… గిన్నిస్ బుక్ ఎక్కాల్సిందే…!
X

దిశ, ఆదిలాబాద్: భారీ ఎత్తున మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు కు ఆదిలాబాద్ లో యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వన్ మిలియన్ ప్లాంటింగ్ పేరట నామకరణం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు జులై 4వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని దుర్గా నగర్ లో గల నర్సరీ పక్కన విశాలమైన అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేయడంతో పాటు గుంతలు తవ్వుతున్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఈ భారీ మొక్కలను నాటే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతోష్ రావు హాజరు అవుతున్నారు.

ఎమ్మెల్యే పుట్టినరోజున విశాలమైన 120 ఎకరాల్లో దాదాపు 3.50 లక్షల మొక్కలను ఒక గంటలో నాటేందుకు 25 జేసీబీ లు నాలుగు ట్రాక్టర్లతో పది రోజుల నుండి భూమిని చదును చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా టర్కీ దేశంలో నవంబర్ 2019 లో ఒక గంట వ్యవధిలో 3.03 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. అయితే ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు అదిలాబాదు లో ఒక గంట వ్యవధిలో 3.50 లక్షల మొక్కలను నాటేందుకు 15 వేల మంది అవసరం ఉండగా వారిని సమకూర్చే పనిలో ఉన్నారు. ఈ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ , లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కోసం ఇప్పటికే వారికి సమాచారం అందించారు. అదేవిధంగా మునిసిపల్ పరిధిలో ఒక్కొక్క ఇంటికి ఆరు మొక్కల చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed