ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు .. గిన్నిస్ బుక్‌లో ఆదిలాబాద్

by  |
ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు .. గిన్నిస్ బుక్‌లో ఆదిలాబాద్
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ప్రపంచ రికార్డు సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినం సందర్భంగా రెండు వందల ఎకరాల్లో 30 వేల మంది పది లక్షల మొక్కలు నాటి టర్కీ దేశం పేరిట ఉన్న రికార్డును చెరిపేసి లిమ్కా, గిన్నిస్ బుక్ లో కి ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా లిమ్కా, గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రతినిధులు ఎమ్మెల్యే జోగు రామన్న కు సర్టిఫికెట్‌ను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగు రామన్న స్వీకరించారు. తన జన్మదినం సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంతో పది లక్షల మొక్కలు నాటడానికి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దుర్గా నగర్ నర్సరీ లోని రెండు వందల ఎకరాల్లో పది రోజులుగా గుంతలను తవ్వించి ఏర్పాట్లను చేశారు.

ఆదివారం ఆయన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడానికి ముహూర్తం పెట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు తో పాటు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, అభిమానులు కార్యకర్తలు 30 వేల మంది తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న 60 నిమిషాల వ్యవధిలోనే 10 లక్షల మొక్కలను నాటి టర్కీ దేశం పేరట ఉన్న ప్రపంచ రికార్డును చెరిపేసిన గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ లో ఆదిలాబాద్ పేరును ఎక్కించారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్, లిమ్కా రికార్డ్ ప్రతినిధులు ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగు రామన్న కు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు జోగు రామన్న ను ప్రశంసించారు.



Next Story

Most Viewed