చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి బయటకు రాకండి : ఎమ్మెల్యే

by  |
MLA Haripriya
X

దిశ ,ఇల్లందు: ‘‘నియోజవకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. మాస్కులు ధరించండి. రానున్న రోజులు మనవి కావు. పరిస్థితి బాలేక ఆస్పత్రిలో పడితే లక్షలు పెట్టినా బతుకుతామో లేదో తెలియదు.’’ అంటూ సాక్షాత్తు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గ కేంద్రంలో మైక్‌తో కరోనాపై అవగాహన కల్పంచారు. శనివారం లాక్‌డౌన్ సడలింపును ప్రజలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో చూడటానికి వెళ్లిన ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ఉదయం 6 గంటల నుండి తండోపతండాలుగా ప్రజలు దుకాణాల ముందు నిలబడటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో కరోనా పట్ల అవగాహన పెంచేందుకు మైకు ద్వారా ప్రచారం చేశారు. ప్రతి షాప్‌‌కు వెళ్లి కరోనా నియమ నిబంధనలు పాటించాలని వ్యాపారులను కోరారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా సోకి అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

‘‘దయచేసి ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించండి. బయటకు వచ్చేటప్పుడు రెండు మాస్కులు ధరించండి.’’ అని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్, దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, కౌన్సిలర్లు పాబొలుస్వాతి కిరణ్ , సయ్యద్ ఆజాం, గిన్నారపు రజిత రవి, సంధ బిందు ప్రవీణ్, జేఏఓ శ్రీనివాస్, ఇల్లందు మున్సిపాలిటీ ఆర్ఐ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed