కనీస వేతనం ఇవ్వండి- మిషన్ భగీరథ ఉద్యోగులు

by  |
bhagirata
X

దిశ, పరిగి : మిషన్ భగీరథ ప్లాటులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్‌పల్లి మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ ముందు సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. మూడేళ్లుగా కాంట్రాక్టు పద్దతిని చేస్తున్నా తమకు కనీస వేతనం ఇవ్వకుండ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చేఅరకొర జీతం కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే మిషన్ భగీరథ వేరే ప్లాంట్లలో ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని, పరిగి ప్లాంటు వద్దే తక్కువ వేతనాలు ఇస్తున్నారంటూ మండి పడ్డారు. మిషన్ భగీరథ ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచాలన్నారు. లేదంటే ఉద్యోగులంతా కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



Next Story