యూఎస్ వెళ్లిన మీరాబాయ్ చాను

by  |
యూఎస్ వెళ్లిన మీరాబాయ్ చాను
X

దిశ, స్పోర్ట్స్ : వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఈ నేపథ్యంలో మెరుగైన శిక్షణ కోసం ఆమె శనివారం అమెరికా బయలుదేరి వెళ్లింది. ఆమెతో పాటు కోచ్‌లు విజయ్ శర్మ, సందీప్ కుమార్ కూడా వెళ్లారు. అమెరికాలోని సెయింట్ లూయీస్‌లో ఆమె 83 రోజుల పాటు శిక్షణ తీసుకొని అటు నుంచే నేరుగా టోక్యో ఒలంపిక్స్‌కు చేరుకుంటుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఆమెను ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేశారు.

ఇటీవల జరిగిన ఏసియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన చాను.. క్లీన్ అండ్ జర్క్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మెరుగైన శిక్షణ కోసం తనను అమెరికా పంపాలని ఆమె మిషన్ ఒలంపిక్ సెల్‌ను కోరింది. దీంతో ఆమె అభ్యర్థనను వెంటనే అంగీకరించింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికా బ్యాన్ చేయకముందే వారిని పంపాలని ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు.

Next Story

Most Viewed