చేప పిల్లలను ఉచితంగా ఇస్తున్నది అందుకే: వేముల

by  |
చేప పిల్లలను ఉచితంగా ఇస్తున్నది అందుకే: వేముల
X

దిశ, బాల్కొండ: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండలం నాగపూర్‌లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో చేప పిల్లలను.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలని, దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి.. ఆర్థిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. నిజామాబాద్ జిల్లాలో 896 చెరువులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మొత్తంగా 4 కోట్ల 30 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 4 కోట్ల 40 లక్షలు ఖర్చు చేశామన్నారు. అటు ఎస్సారెస్పీలో కూడా మరో 62 లక్షల చేపపిల్లలను వదులుతున్నట్లు వేముల చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed