మంత్రి వేముల పీఆర్‌ఓ కేసులో ట్విస్ట్.. నిన్న భార్యను కొట్టి.. నేడు చంపాలని..

by  |
మంత్రి వేముల పీఆర్‌ఓ కేసులో ట్విస్ట్.. నిన్న భార్యను కొట్టి.. నేడు చంపాలని..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్‌ఓ తోట శ్రీకాంత్ వివాదం చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల వివాదంలో నడిరోడ్డుపై ఆమెపై దాడి చేయడంతో అతనిపై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తన భర్త అధిక కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ భార్య కోమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తన భార్య కోమలపై ఘాటు ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. తన చావుకు కారణం భార్య తరుపువారేనని తెలుపుతూ ఒక లేఖను శ్రీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన భార్య తనను చంపాలని చూస్తోందని, ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నా కనీసం చూసేందుకు రాలేదని ఆరోపించాడు.

తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిిమాండ్ చేసిందని, విడాకులు ఇవ్వాలని కోరినా ఇవ్వనని పెద్దపల్లి జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులతో తనను బెదిరింపులకు గురి చేసిందని తెలిపాడు. తన భార్య, వారి కుటుంబ సభ్యులు తనను అవమానించేలా మాట్లాడారని, తన చావుకి భార్య, వాళ్ల అమ్మ, వాళ్ల తమ్ముడు, వాళ్ల బాబాయి తొగరి ఓదెలు కారణం అంటూ లేఖలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు తన దేవుడని, తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను కాపాడారని తెలిపాడు. ప్రస్తుతం శ్రీకాంత్ పేరిట రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై శ్రీకాంత్ అన్న శ్రీధర్, వదిన రమాదేవి మాట్లాడుతూ “కోమల డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తుందని, తనతో కూడా చాలాసార్లు డబ్బుకోసమే నీ మరిదిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందని తెలిపారు” ప్రస్తుతం ఈ వీడియోలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి.



Next Story

Most Viewed