మమ్మల్ని ఎవరూ విడదీయలేరు.. మంత్రి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
మమ్మల్ని ఎవరూ విడదీయలేరు.. మంత్రి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఉద్యమం ఉపాధ్యాయులను శక్తివంతులుగా తయారు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పీఆర్‌టీయూకు టీఆర్ఎస్‌తో ఉన్నది మామూలు సంబంధం కాదని పేగు బంధం అంటూ అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కాన్వెన్షన్‌లో జరిగిన పీఆర్‌టీయూ 34వ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ నిబద్ధత, సభ్యుల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నదన్నారు. లక్షా రెండు వేల మంది టీచర్లు ఉంటే అందులో 75 వేల మంది పీఆర్‌టీయూ సభ్యులు ఉన్నారన్నారు. టీచర్ల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుకోవడానికి, వాటిని పొందటానికి నిబద్ధతతో కలిసి పనిచేసే నాయకత్వం, అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు కలిసి పనిచేసే వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారని మంత్రి కొనియాడారు. ఇటువంటి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్, శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed