సిటీ స్కాన్ ధరలు తగ్గింపు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటన

by  |
సిటీ స్కాన్ ధరలు తగ్గింపు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటన
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో రూ.1999 సిటీ స్కానింగ్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేదలు సిటీ స్కానింగ్, తదితర టెస్టులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిటి స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడి ధరలను నిర్ణయించడం జరిగిందని మంత్రి చెప్పారు.

దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే సిటీ స్కానింగ్ ను కేవలం రూ.1999కు తగ్గించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో 13 ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పేషెంట్ లకు వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రెమిడిసివిర్ ఇంజక్షన్లు, తదితర మందులను ఎంఆర్పి రేట్లకే అందివ్వాలని, ఎక్కువ బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్ డి ఓ, డి ఎస్ పి ల తో కలిపి టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో 20 శాతం బెడ్లు పేదలకు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది నిరంతరం శ్రమించి ప్రజల ప్రాణాలు కాపాడడానికి అంకితభావంతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిలో 1374 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story