రూ.13 లక్షలతో బొటానికల్ గార్డెన్ : మంత్రి

by  |
రూ.13 లక్షలతో బొటానికల్ గార్డెన్ : మంత్రి
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రభుత్వ బాలుర కళాశాల మరియు ఎంవీఎస్ కళాశాలలో రూ.13లక్షల వ్యయంతో బొటానికల్ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ కళాశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు బాయ్స్ కళాశాల అంటేనే ప్రజలకు భయం భయంగా ఉండేదని, చీకటి పడిన తరువాత మహిళలు ఇటువైపు నుంచి వెళ్లడానికి భయపడేవారని, అటువంటి కళాశాల నేడు మంచి కళాశాలగా గుర్తింపు తెచ్చుకున్నదని, నేను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూ. 13లక్షల వ్యయంతో బొటానికల్ గార్డెన్స్ త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ గార్డెన్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతేకాకుండా దేశంలోని అతిపెద్ద పార్క్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

Next Story

Most Viewed