బాలిక వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దు

by  |
బాలిక వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దు
X

• మంత్రి సత్యవతి రాథోడ్

దిశ, న్యూస్‌బ్యూరో :
రాజకీయ హడావిడిలో లైంగికదాడికి గురైన బాలిక వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని ఆమె అన్నారు. శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే బాలిక వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే హడావిడి చర్యలు చేపట్టకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్టు తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు బాలిక కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉంటున్నారని, అమ్మాయి భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. దళిత బాలిక పట్ల ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Tags: Minister, Satyavathi rathod, Child Protection, Victim, Accused, Shakil



Next Story

Most Viewed