సీసీటీవీ పుటేజీలో టీడీపీ నేతల భాగోతం.. ఇప్పుడేం చెబుతారో

by  |
సీసీటీవీ పుటేజీలో టీడీపీ నేతల భాగోతం.. ఇప్పుడేం చెబుతారో
X

దిశ,వెబ్‌డెస్క్: రేషన్ డెలవరీ వెహికల్ లాంఛ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో జరిగిన విగ్రహాల విధ్వంసంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం పాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ తరలింపు శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలిగిస్తున్న దృశ్యాల్ని విడుదల చేశారు. తొలగించిన విగ్రహాన్నిసిమెంట్‌ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అనుచరులతో పాటు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు. విగ్రహాల పేరుతో ప్రజల్లో అనిశ్చితిని నెలకొల్పడానికే, ప్రజల్లో ఉన్న సోదర భావాల్ని రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీదిరి ఆరోపించారు.

రామతీర్ధం అంటూ హడావిడి చేసిన చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించడం లేదన్నారు. సాక్ష్యాలు లేని సందర్భాలుంటే పొలోమంటూ వాలిపోయి ప్రభుత్వాన్ని విమర్శిస్తారని మండిపడ్డారు.

బైబిల్ పట్టుకున్న ఓ మహిళ భర్తకి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టామా..?తిరుపతిలో శిలువ పెట్టామా..?అన్యమత ప్రచారం చేస్తున్నామా..?తిరుపతి ఏడుకొండల్ని రెండుకొండలుగా మార్చామా…? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సంతబొమ్మాళి ఘటనపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఈ విగ్రహ రాజకీయాలకు స్వస్తిపలకాలన్నారు.

చంద్రబాబునాయుడు భవిష్యత్ లో నారాలోకేష్ ను సీఎం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని సెటైర్లు వేశారు. శిశుపాలుడు లేడు ఉన్నది శిశుబాబే అది లోకేష్ బాబేనని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు.



Next Story