చినుకు పడితే రైతుల అకౌంట్‌లో డబ్బులు: సబిత

by  |
చినుకు పడితే రైతుల అకౌంట్‌లో డబ్బులు: సబిత
X

దిశ, మహేశ్వరం: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామంలో ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షల నిధులు, మీర్కాన్‌పేట్ గ్రామంలో రైతు వేదిక, సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, వైకుంఠ దామం, బేగరికంచ గ్రామ పరిధిలో వావిళ్ల కుంట తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కందుకూరు మండల కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పాల్గొని.. ఎంపికైనా వారికి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. వాన చినుకులు పడగానే నేరుగా రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్‌లో జమ చేస్తున్నామన్నారు. నిరుదోగ్య సమస్య తీర్చడానికి ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలల్లో ఉదోగ్య, ఉపాధి కల్పననకు చర్యలు తీసుకుంటుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఫార్మా సిటీ, అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సబిత వెల్లడించారు.



Next Story

Most Viewed