వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by  |
Minister-Sabitha1
X

దిశ, మహేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అనంతరం 30 పడకల ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ కిట్స్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ఎల్బీనగర్, సనత్ నగర్, గచ్చిబౌలి, మేడ్చల్ లో నాలుగు మల్టీస్పెషాలిటీ స్థాయిలో ఆసుపత్రులను నిర్మిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మార్చి నెల చివరి నాటికి పనులు పూర్తవుతయన్నారు. కరోనా విపత్కర సమయంలో ఆశావర్కర్లు, వైద్యులు ప్రాణాలకు తెగించి సేవాలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతఆంద్య నాయక్, ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, వైద్యాధికారిణిలు ఝాన్సీలక్ష్మి, గాయత్రి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూన యాదయ్య, కర్రోల్ల చంద్రయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed