మంత్రి పేర్ని నాని ఇంట విషాదం

by  |
మంత్రి పేర్ని నాని ఇంట విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంట విషాదం నెలకొంది. పేర్ని నానికి మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా నాని తల్లి పేర్ని నాగేశ్వరమ్మ(82) అనారోగ్యంతో బాధపడుతున్నారు.

విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రెండు రోజుల క్రితమే ఆమె ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి మచిలీపట్నంలోని ఇంట్లో ఉంటున్నారు. గురువారం ఉదయం మరోసారి ఆమె అనారోగ్యానికి గురికావటంతో విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వరమ్మ తుదిశ్వాస విడిచారు.

Next Story