ప్రకటనలు కాదు.. ముందు వ్యాక్సిన్ తెప్పించండి: కేటీఆర్

by  |
ప్రకటనలు కాదు.. ముందు వ్యాక్సిన్ తెప్పించండి: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించిన ఆయన.. నూతనంగా ఏర్పాటు చేసిన 150 పడకల ఐసీయూ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయాలని విమర్శించారు. కేవలం ప్రకటనలతో చేతులు దులుపుకుందన్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనలతోనే సరిపెట్టుకోకుండా.. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్‌లను తెప్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు కొనాలనుకున్నా వ్యాక్సిన్ దొరకడం లేదన్నారు.



Next Story