సామాజిక స్పృహతో పని చేయాలి : కేటీఆర్

by  |
సామాజిక స్పృహతో పని చేయాలి : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో పని చేయాలని, సమాజానికి మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కే. తారక రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం గిఫ్ట్​ ఏ స్మైల్​ఛాలెంజ్ లో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్​పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ రూ.22 లక్షల విలువ గల అంబులెన్స్ ను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే కార్యక్రమంలో విద్యాసాగర్ ముందుంటారని ప్రశంసించారు. ఆయనలాంటి యువ నాయకులు భాగస్వాములై సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులు సొంత డబ్బుతో ప్రజాసేవ చేసే సేవకులని అభినందించారు. తర్వాత కర్నాటి విద్యాసాగర్​ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం తపించే డైనమిక్​ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. ఆయన బాటలో ప్రజాసేవకు అంకితమవుతామన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్​బాలమల్లు, జీహెచ్ఎంసీ మేయర్ బొoతు రామ్మోహన్, మునుగోడు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story