కార్మికుడి మిస్సింగ్..మంత్రి కొప్పుల ఆరా

by  |

దిశ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని 11ఇన్‌క్లైన్ బావిలో కనిపించకుండా పోయిన కార్మికుడి గురించి తెలుసుకునేందుకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం బొగ్గు బావిని సందర్శించారు. డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్, రామగుండం ఏరియా -1 జీఎం కె.నారాయణతో మంత్రి విడివిడిగా మాట్లాడారు. కార్మికుడు సంజీవ్ కనిపించకుండా పోవడానికి గల కారణాలపై మంత్రి ఆరా తీశారు. స్పందించిన అధికారులు రెస్క్యూ బృందాలు కార్మికుని కోసం ఆన్వేషణ కొనసాగిస్తున్నాయని వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత సంజీవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ..రెస్క్యూ ఆపరేషన్, క్రాస్ చెక్ కొనసాగుతోందని, జీఎం మరియు ఇతర అధికారులు బొగ్గు గని వద్దే ఉండి రెస్క్యూ ఆపరేషన్ తీరును పరిశీస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా కార్మికుడి ఆచూకీ కనుగొంటామని మంత్రి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఉన్నారు.

Tags: singareni mine, 11incline, labour missing, minister koppula visit mine, godavari khani



Next Story

Most Viewed