- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు
దిశ ప్రతినిధి, నిజామాబాద్:తెలంగాణ రాష్ర్టంలో కోవిడ్-19 మహమ్మారి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అదివారం నిజామాబాద్ ప్రగతిభవన్‌లో కరోనా నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం విస్తరించిందని దాని దెబ్బకు అమెరికాతో పాటు యూరప్ సైతం విల విల్లాడుతుంటే భారతదేశంలో మరణాల రేటు తక్కువగా, కోలుకున్న వారు ఎక్కువ అని అన్నారు. ఇక్కడి ఆరోగ్య పరిస్థితులు, జీవన విధానమే దానికి కారణం అన్నారు. దేశంలో కోవిడ్ మరణాలు 3 శాతం ఐతే తెలంగాణలో ఒక్కశాతమే అని అన్నారు. కొన్ని దుష్టశక్తులు కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. నిజామాబాద్ కోవిడ్ ఆసుపత్రిలో 450 బెడ్లతో, సెంట్రలైజ్జ్ ఆక్సీజన్ తో పాటు 50 ఐసీయూ బెడ్లు, 25 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బోధన్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులతో పాటు ఆర్మూర్, బాన్సువాడ ఆసుపత్రులలో కోవిడ్ వైద్యం ఆందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆసుపత్రలలో కావాల్సిన ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, నాల్గో తరగతి ఉద్యోగుల నియమాకం ఆసుపత్రి సూపరింటెండెంట్లు జిల్లా కలెక్టర్‌తో కలిసి నియమాకాలకు అనుమతిచ్చామన్నారు. నిజామాబాద్ జిల్లాకు పొరుగు రాష్ట్రాల సరిహద్ధుతో పాటు విదేశాల్లో ఉపాధికి వెళ్లి రావడమే కేసులు పెరుగుదలకు కారణమన్నారు. నిజామాబాద్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి ఉండటంతో వైద్యం త్వరగా అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ పాజిటివ్ కేసుల వారికి అందించే కిట్లను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్, జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, తదితరులు ఉన్నారు.