ధరిత్రిని సంరక్షిస్తేనే మానవ మనుగడ: మంత్రి అల్లోల

by  |
ధరిత్రిని సంరక్షిస్తేనే మానవ మనుగడ: మంత్రి అల్లోల
X

దిశ, ఆదిలాబాద్: ధ‌రిత్రి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మాన‌వ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌పంచ‌ ధరిత్రీదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు. ప్రాణకోటికి అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, ఈ భూ గ్రహాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెల్లడించారు. మానవ తప్పిదాల వల్లే వైరస్‌లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైర‌స్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. ప‌ర్యావరణ విధ్వంసం మూలంగా గతంలో ఎబోలా, మెర్స్‌, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు సంభవించినట్టు తెలిపారు. ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ పీడిస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు పెంచడాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యమంలా చేప‌ట్టింద‌ని తెలిపారు. ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షిస్తూ.. కొత్త మొక్క‌ల‌ను నాటాలని పేర్కొన్నారు.

Tags: Minister Indrakaran reddy,Earth,statement

Next Story

Most Viewed