ఆ నాయకుల మాటలు నమ్మొద్దు: మంత్రి హరీష్ రావు

by  |
Minister Harish Rao
X

దిశ, జమ్మికుంట: కొంతమంది నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్వయం సహాయక సంఘాలకు రూ.2 రెండు కోట్ల 13 లక్షల 48 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఆసరా పింఛన్లతో వృద్ధులకు భరోసా కల్పించినట్లు అయిందని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏడేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెరిగిందని, వాళ్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సహాయం చేయలేదని చెప్పుకొచ్చారు.

జమ్మికుంటలో మహిళల కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఇచ్చిందో ఆలోచించాలని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోందన్నారు. ఎన్నికల్లో ఒకే వ్యక్తికి లాభం జరిగితే మనం నష్టపోతామని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed