సెకండ్‌ వేవ్‌పై అసత్య ప్రచారాలు వద్దు: ఈటల

by  |
సెకండ్‌ వేవ్‌పై అసత్య ప్రచారాలు వద్దు: ఈటల
X

దిశ, సూర్యాపేట: కొవిడ్ వ్యాధిపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను గందరగోళంలో పడేయకూడదని మంత్రులు కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రంను మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో పరిస్థితులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ బారిన పడిన వారితో పాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులదే అన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉందని.. మే 1 నుంచి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ.. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed