క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

by  |
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
X

దిశ, హైదరాబాద్ :

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర వస్తువులను 200 మంది పేద మహిళలకు అందజేశారు. ఈ మేరకు లాల్ బహదూర్ స్టేడియంలో 10 రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ మమతా గుప్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్ , జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నియంత్రణలో సీఎం కేసీఆర్ ముందస్తుగా తీసుకున్న నివారణ చర్యలు, ఏర్పాట్ల వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులను దాతల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహబూబ్ నగర్ కు చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి పంపినా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించి కరోనాను నియంత్రించాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడానికి క్రీడాకారులు ముందుకు రావాలన్నారు. దాతలు ఇపుడు తమ దేశభక్తిని సేవ ద్వారా చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే గోపి చంద్, సానియా మీర్జా, సింధు, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ లాంటి క్రీడాకారులు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Tags: Minister Srinivas Goud, Sportsmen, Gopichand, Sania Mirza

Next Story

Most Viewed