తండ్రీ కొడుకుల మాటలన్నీ అవాస్తవం : అవంతి

by  |
తండ్రీ కొడుకుల మాటలన్నీ అవాస్తవం : అవంతి
X

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీ ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు.కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారాలోకేష్ కూడా ఘాటుగా స్పందించారు. దీనిపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ తండ్రీకొడుకుల మాటలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేశారని, అందువల్లే కూల్చినట్లు స్పష్టంచేశారు. గీతం యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విద్యార్థులకు ఏమైనా ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ప్రహరీ కూల్చిన ఘటనలో మాకు ఎవరిమీద కక్షలేదు. ఎలాంటి నయా పైసా చెల్లించకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చంద్రబాబుకు కేవలం అమరావతి అభివృద్ధిపైనే దృష్టి ఉందని.. కానీ, తమ ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలన్నదే మా ధ్యేయమని మంత్రి అవంతి స్పష్టంచేశారు.



Next Story

Most Viewed