మాటకు కట్టుబడి ఉంటాం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

by  |
మాటకు కట్టుబడి ఉంటాం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
X

దిశ, ముధోల్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని న్యాయ,దేవాదాయ,అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ శాసనసభ సభ్యులు విఠల్ రెడ్డి మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమీకృత మార్కెట్ వ్యవస్థ అవసరం అని చెప్పి సీఎం కేసీఆర్ ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో అన్ని రకాల కూరగాయల, పండ్ల, ఇలా పలు దుకాణాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయబడి ఉంటాయని అన్నారు.

ఈ సమీకృత మార్కెట్ యార్డ్‌ల ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మొత్తం ఏడు కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఈ మార్కెట్‌కి టీ.యు.ఎఫ్.ఐ.డీ.సీ. ద్వారా 4 కోట్ల 50 లక్షల రూపాయలు, పట్టణ ప్రగతి, మున్సిపల్ శాఖల ద్వారా 2 కోట్ల 70 లక్షల అందనున్నాయి. అలాగే ప్రకృతి పచ్చదనాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని గ్రామీణ, మున్సిపల్ బడ్జెట్లలో 10 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 50 వేల రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందేనని ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. అనంతరం పట్టణంలో ఇటీవల వరద నీటి ముంపు‌కి గురి అయినటువంటి ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ అసిఫ్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జాబీర్ అహ్మద్, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story