సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట

by  |
సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని, కరోనా విస్తరిస్తున్న సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమానికే పెద్దపీట వేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలంలో ఆదివారం లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

పేద, ధనిక తారతమ్యం లేకుండా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. కార్య‌క్ర‌మంలో కలెక్టర్ కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed