ఎట్టకేలకు స్వగ్రామాలకు యాదాద్రి పవర్ ప్లాంట్ కార్మికులు

by  |

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్​లో పనిచేస్తున్న వలస కూలీలు లాక్‌డౌన్ నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొంతూర్లకు పంపించాలని కోరుతూ కూలీలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు అధికారులు వారిని శనివారం హైదరాబాద్​కు తరలించారు. మొదటి విడతలో భాగంగా 107 మందిని ప్రత్యేక బస్సుల్లో నగరానికి పంపించారు. అక్కడి నుంచి రైలు ద్వారా వారిని సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్లాంట్​లో మొత్తం 1500 మంది వలస కూలీలు పనిచేస్తుండగా సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడే వారిని మొదటి విడతలో ఆరోగ్య పరీక్షలు చేసి మూడు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. వీరిలో బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు 107 మంది వలస కూలీలను హైదరాబాద్​కు పంపించారు. మిగతా కూలీలను కూడా వారి కోరిక మేరకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed