బిపిన్ రావత్ ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్‌ వివరాలు..

by  |
helicopter
X

దిశ, వెబ్‌డెస్క్: Mi-17V-5 హెలికాప్టర్‌ను తయారు చేసింది రష్యా దేశం. IAF ఈ హెలికాప్టర్‌ను సైనిక రవాణా కొరకు ఎక్కువగా వాడుతుంది. సిడిఎస్ బిపిన్ రావత్, అతని సిబ్బంది కొంతమంది కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్ Mi-17V-5 మీడియం-లిఫ్టర్ ఛాపర్‌. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విమానాలో ఒకటి.

Mi-17V-5 హెలికాప్టర్ చరిత్ర..

ఈ Mi-17V-5 అనే హెలికాప్టర్‌ను రష్యాకు చెందిన కజాన్‌లోని రష్యన్ హెలికాప్టర్‌ల అనుబంధ సంస్థ అయిన కజాన్ హెలికాప్టర్స్ అనే సంస్థ ఈ హెలికాప్టర్‌లను తయారు చేస్తుంది. ఈ హెలికాప్టర్ లకు క్లిమోవ్ TV3-117VM లేదా VK-2500 టర్బో-షాఫ్ట్ అనే ఇంజన్ ద్వారా ఈ హెలికాప్టర్‌లు పనిచేస్తాయి. TV3-117VM అనే ఇంజన్ గల హెలికాప్టర్‌ గరిష్టంగా 2,100hp శక్తిని అందుకుంటుంది. అలాగే VK-2500 అనే ఇంజన్ గల హెలికాప్టర్‌లు గరిష్టంగా 2,700hp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. Mi-17V-5 మోడల్ కొత్తగా వచ్చే హెలికాప్టర్‌లు VK-2500 ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ హెలికాప్టర్ గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. దీనికి రెండు సహాయక ఇంధన ట్యాంకులను అమర్చితే నిర్విరామంగా 1,065 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. Mi-17V-5 విమానాలను సైన్యం, ఆయుధాల రవాణా, ఫైర్ సపోర్ట్, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్, రెస్క్యూ అపరేషన్‌లు కొరకు ఉపయోగిస్తారు.

Mi-17 హెలికాప్టర్ గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోయగలదు. ఈ హెలికాప్టర్‌లో 36 మంది ప్రయాణించవచ్చు. పోర్ట్‌సైడ్ డోర్‌ కలిగిన పెద్ద క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. వస్తువులను ఎక్కించడానికి, దింపడానికి అలాగే సైనికులు త్వరగా మూవ్ అవ్వడానికి హెలికాప్టర్‌కు వెనుక రాంప్ ఉంటుంది. ఈ హెలికాప్టర్ అన్ని రకాల వాతవరణ పరిస్థితులలో ప్రయాణించగలదు. Mi-17V-5 నాలుగు మల్టీఫంక్షన్ డిస్‌ప్లేలు కలిగి ఉంటుంది. నైట్-విజన్ పరికరాలు, వెదర్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చే రాడార్ ను కలిగి ఉంటుంది. ఆటోపైలట్ సిస్టమ్‌, నావిగేషన్, ఇన్ఫర్మేషన్-డిస్ప్లేలు, క్యూయింగ్ సిస్టమ్‌, KNEI-8 ఏవియానిక్స్ సూట్స్ ఈ హెలికాప్టర్ సొంతం.

ఈ హెలికాప్టర్‌లు కేవలం రవాణా కొరకే కాకుండా అనేక రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది. Mi-17 హెలికాప్టర్ S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్‌లు, AKM సబ్-మెషిన్ గన్‌లను కలిగి ఉంటుంది. అలాగే గన్నర్ కొరకు వెనుక ప్రత్యేక స్థలం ఉంటుంది. అంతే కాకుండా యుద్ద సమాయాలల్లో సైన్యాన్ని, వారికి అవసరమైన సరుకులను కూడా అందిస్తుంది.

ఈ రకం విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం భారత్ డిఫెన్స్ మినిస్ట్రీ డిసెంబరు 2008లో రష్యా నుండి 80 హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. రష్యా ఈ విమానాలను 2011‌లో కొన్నింటిని భారత్ కు అందించింది. మిగిలిన అన్ని విమానాలను 2018లో అందించింది.


Next Story

Most Viewed