అదే జోరు..లాభాలో షేర్లు!

by  |
అదే జోరు..లాభాలో షేర్లు!
X

ర్బీఐ సమీక్షా సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. అంతర్జాతీయంగా కూడా పరిణామాలు సానుకూలంగా ఉండటం కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా నాలుగోరోజు లాభాల్లోనే ముగిసిన మార్కెట్ సెన్సెక్స్ 163 పాయింట్ల లాభంతో 41,306 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 12,137 వద్ద క్లోజయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, బజాజ్ ఫినాన్స్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకుల షేర్లు లాభాల్లో కొనసాగగా, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు నష్టాలను చవి చూశాయి. వినియోగదారు వస్తువుల రంగం భారీ నష్టాలను చూసింది. ప్రైవేట్ బ్యాంకులు, మెటల్, ఫార్మా రంగాలు దాదాపు ఒక శాతం పైగా బలపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.23 వద్ద ఉంది.



Next Story

Most Viewed