- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్కర్లు లేకపోవడంతో.. వంట చేసి విద్యార్థులకు వడ్డించిన ఎంఈవో
దిశ,పాలేరు: స్వయానా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండల ఎంఈవో వెంకటరామాచారి స్వయంగా స్కూల్ విజిట్ చేశారు. మధ్యాహ్న భోజనం వర్కర్ రాకపోవడంతో విద్యార్థులకు ఎంఈఓ తానే భోజనం వండారు..ఎర్రగడ్డ తండాలో ప్రాథమికొన్నతి పాఠశాల ఉంది. ఈ నేపథ్యంలో అందులో 48 మంది విద్యార్థులున్నారు. కరోనా అనంతరం పాఠశాలలు పున:ప్రారంభం కాగా.. ఆనాటి నుంచి విద్యార్థులకు పాఠాశాలలో మధ్యాహ్న భోజనం లేదు.
పెరిగిన ధరలతో వర్కర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. స్థానిక సర్పంచ్ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రస్తుత పరిస్థితిని కూసుమంచి మండల విద్యాశాఖ అధికారికి సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎంఈవో తక్షణమే పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం వర్కర్లతో మాట్లాడారు. వారు నిరాకరించడంతో ప్రధానోపాధ్యాయుడితో కలిసి పోయి వెలిగించి వంట మొదలు పెట్టారు. విద్యార్థులు ఆశ్ఛర్యంగా చూస్తుండగా.. ఎంఈవో వెంకటరామారాచారి స్వయంగా బియ్యం కడిగి పొయిమీద పెట్టి వంట వండి ఆయనే వడ్డించారు. అంతే కాదు విద్యార్థులతో కుర్చోని భోజనం చేసి వారేవ్వా.. అనిపించారు. ఇదంతా చూసిన ఎర్రగడ్డతండా గ్రామస్థులు ఎంఈవో చేసిన పనికి ఫిదా అయ్యారు. వర్కర్లు రాకపోయిన రోజుకోక్కరం చొప్పున వంట చేస్తామని గ్రామస్థులు హామినిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎంఈవో చేసిన పలువురు అభినందనలు చెబుతున్నారు.