రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: మెగాస్టార్

by  |
rosaiah
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా మెలిగారని చిరు అన్నారు. ‘రోశయ్య గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ ఋషిలా సేవ చేశారు. ప్రజల కోసం ఎంతో శ్రమించిన మహోన్నత నేత. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. రోశయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. రాజకీయాల్లో వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజామన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య’ అని మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలిపారు. రాజకీయ నాయకుల్లో రోశయ్య వంటి వారిని తాను మరొకరిని చూడలేదని, ప్రజాసేవే సంకల్పంగా ఆయన పనిచేసేవారని చిరు చెప్పుకొచ్చారు.

రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం : రేవంత్ రెడ్డి

Next Story