షాకింగ్.. కొంపముంచిన ఫ్రెషర్స్ డే పార్టీ.. 182 మంది విద్యార్థులకు పాజిటివ్

by  |
షాకింగ్.. కొంపముంచిన ఫ్రెషర్స్ డే పార్టీ.. 182 మంది విద్యార్థులకు పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ కారణంగా కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో కర్నాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ కారణంగా 182 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. ధార్వాడ్‌లోని SDM మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థులు ఇటీవలే ఫ్రెషర్స్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీ మూడ్‌లో వారంతా కరోనా నిబంధనలను బేఖాతరు చేశారు.

దీంతో పార్టీలో పాల్గొన్న విద్యార్థుల్లో ఏకంగా 182 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో రెండు డోసుల టీకా తీసుకున్న వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. అయితే, పార్టీ అనంతరం మెడికల్ కాలేజీలో మొదట 300 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 116 మందికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 182కు పెరిగింది. దీంతో SDM మెడికల్ కాలేజీ కొవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది.

ఈ ఘటనతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వారికి సోకింది కొత్త వేరియంటా? అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సదరు విద్యార్థులకు జన్యు పరీక్షలు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా బారిన పడినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.

Next Story

Most Viewed