RTC ఆర్‌ఎంలతో ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్

by  |
RTC ఆర్‌ఎంలతో ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్‌ వ్యాప్తి, ఆర్టీసీ పరిస్థితి, ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ .. మే 21 నుంచి 30 శాతం బస్సులే నడుస్తున్నాయి.

కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం వచ్చే ఆదాయం డీజిల్‌ ఖర్చుకే సరిపోతోంది. కరోనా సోకకుండా ఆర్టీసీ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలి. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలి. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలి. కరోనా వల్ల తగ్గిన ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో భర్తీ చేయాలన్నారు. సరకు రవాణాతో ఆదాయం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్ల పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాలి” అని జిల్లాల ఆర్‌ఎంలకు ఎండీ కృష్ణబాబు దిశానిర్దేశం చేశారు.

Next Story

Most Viewed