ఐదురోజులు బంగారం ధరలకు బ్రేక్!

by  |
ఐదురోజులు బంగారం ధరలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే, మార్కెట్ల నష్టాన్ని తగ్గించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు లాభపడ్డారు. ఈ క్రమంలో మల్టీ కమొడిటీ మార్కెట్లో పది గ్రాముల బంగారం రూ. 500 తగ్గి రూ. 41, 579 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం పసిడి బుధవారంతో పోలిస్తే 8 డాలర్ల వరకూ తగ్గి ప్రస్తుతం ఔన్స్ బంగారం 1,624 వద్ద ట్రేడవుతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఆర్థిక వ్యవస్థలను కాపాడటానికి పలు దేశాలు అందిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా పసిడి ధరలు హెచ్చు తగ్గులను చూస్తున్నాయి.

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. ఇండియన్ కమొడిటీ ఎక్స్ఛేంజ్, మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా కలిసి ఫ్యూచర్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. సెబీతో చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని ధృవీకరించాయి. ప్రస్తుతం ఫ్యూచర్ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.45 వరకు ఉంటుంది. అయితే, సవరించిన సమయం ప్రకారం ఏప్రిల్ 30 వద తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకూ కేవల 8 గంటలు మాత్రమే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఫ్యూచర్ మార్కెట్లు ట్రేడింగ్ జరుగుతాయని ఎంసీఎక్స్, ఐసీఎక్స్ సర్క్యూలర్‌ను ఇచ్చాయి. ఇప్పటివరకూ మార్కెట్ల సమయంలో మొదటి పదిహేను నిమిషాలు జీటీసీ చెల్లుబటయ్యే ఆర్డర్స్ రద్దు కోసం ప్రీ-ఓపెన్ సెషన్, చివరి పదిహేను నిమిషాలు రాత్రి 11.30 నుంచి 11.45 వరకు క్లోజింగ్ సెషన్ నిర్వహించనున్నారు. మారిన సమయాలను బట్టి ఈ ఓపెనింగ్, క్లోజింగ్ సెషన్లు జరుగుతాయి. అలాగే, ఏప్రిల్ 2న, ఏప్రిల్ 6న, ఏప్రిల్ 14న సాయంత్రం సెషన్ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed