మ్యాక్స్ ఫైనాన్షియల్స్ సర్వీసెస్ త్రైమాసిక లాభంలో 96 శాతం క్షీణత!

by  |
మ్యాక్స్ ఫైనాన్షియల్స్ సర్వీసెస్ త్రైమాసిక లాభంలో 96 శాతం క్షీణత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీస్సెస్ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 96.7 శాతం క్షీణించి రూ. 6.67 కోట్లకు పడిపోయిందని సంస్థ ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ. 199.97 కోట్లుగా నమోదైంది. పన్ను వివాదాల పరిష్కారాలతో తమ లాభం గణనీయంగా తగ్గినట్టు మ్యాక్స్ ఫైనాన్సియల్స్ వివరించింది. ఇక, సంస్థ ఆదాయం రూ. 4,265.64 కోట్లతో గతేడాది కంటే 40 శాతం క్షీణించినట్టు పేర్కొంది. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 416.46 కోట్ల నుంచి రూ. 272.85 కోట్లతో 34.5 శాతం క్షీణించింది. పూర్తి సంవత్సరానికి ఆదాయం రూ. 18,241.76 కోట్లతో 31.7 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఆదాయం రూ. 19,513.26 కోట్లుగా ఉండేది. ఇక, మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,814.10 కోట్లుగా ఉంది.

Next Story

Most Viewed