ఎర్ర సముద్రంలో మిస్టీరియస్ జీవి.. రెండు అడుగుల పొడువు..

226

దిశ, ఫీచర్స్: ప్రకృతితో పాటు సముద్రపు లోతుల్లోని రహస్యాలను తెలుసుకోవడం మనుషులకు ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే వేలాది అన్వేషణల ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నప్పటికీ, ఇప్పటికీ మనకు తెలియని ప్రపంచం ఉంది. కాగా 2020లో రెడ్ సీ(ఎర్ర సముద్రం) లోతును కనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన మెరైన్ బయాలజిస్ట్స్, ఫిల్మ్ మేకర్స్ టీమ్‌తో కూడిన ఓషన్‌ఎక్స్ బృందానికి అలాంటి ఒక రహస్యం కంటపడింది.

నవంబర్ 2011న నీటిలో మునిగి.. 2,800 అడుగుల లోతులో కూరుకుపోయిన ‘పెల్లా’ అనే ఓడ గురించి దర్యాప్తు చేస్తోంది ఈ బృందం. ఈ క్రమంలో మానవుడి కంటే పెద్ద ఆకారంలో పర్పుల్ కలర్‌లో ఉన్న బ్యాక్ స్క్విడ్(సముద్రపు జీవి)ను గుర్తించారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ గురించి వివరించిన ఓషన్‌ఎక్స్ సైన్స్ ప్రోగ్రామ్ లీడ్ మాటీ రోడ్రిగ్.. ‘మేము ఓడ శిథిలాలను చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ భారీ జీవి కనపడింది. ROV (రిమోట్‌‌లీ ఆపరేటెడ్ వెహికల్) నుంచి చూస్తుండగా, దాని మొత్తం శరీరాన్ని మెళికలు తిప్పుతూ శిథిలాల చుట్టూ తిరిగింది’ అని వెల్లడించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఓషన్‌ఎక్స్ బృందం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయింది.

కాగా ఈ మిస్టీరియస్ జీవిని కనుగొన్న నాటి నుంచి వివరాలు తెలుసుకునేందుకు దాదాపు ఏడాది పట్టిందని వివరించింది టీమ్. ఇదొక పెద్ద పర్పుల్ బ్యాక్ ఫ్లయింగ్ స్క్విడ్ అని, రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుందని తేలింది. ఎర్ర సముద్రంలో వీటి సంఖ్య అధికంగా ఉన్నట్లు అంచనా వేసిన టీమ్..ఇది ‘స్టెనోటోథిస్’కు పెద్ద రూపమై ఉంటుందని భావిస్తోంది. ఇక ఓషన్ఎక్స్ అసలు ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇద్దరు మనుషులతో కూడిన ట్రిటాన్ సబ్‌మెర్సిబుల్స్ ఉపయోగించి ఓడ శిథిలాలను అన్వేషించింది. ఈ సబ్‌మెర్సిబుల్స్ ఒక్కొక్కటి 3,280 అడుగుల కంటే ఎక్కువ లోతుకు వెళ్లగలవు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..