జతకట్టిన.. మారుతీ సుజుకి, మహీంద్రా ఫైనాన్స్!

by  |
జతకట్టిన.. మారుతీ సుజుకి, మహీంద్రా ఫైనాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్య లభ్యతను ఎదుర్కొంటున్న వినియోగదారుల కోసం మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా ఫైనాన్స్‌తో జతకట్టింది. వాహన రుణాలను పొందే వినియోగదారులకు మరింత సులభమైన సేవలందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. మారుతీ రిటైల్ అమ్మకాల్లో మూడో వంతు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నమోదవుతున్నాయని, ఈ క్రమంలో రెండు సంస్థల మధ్య ఒప్పందంతో వినియోగదారులకు దగ్గరయ్యే అవకాశముంటుందని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. మహీంద్రా ఫైనాన్స్ సంస్థకు దేశంలో పటిష్టమైన నెట్‌వర్క్ ఉందని, గ్రామీణ, చిన్న స్థాయి పట్టణ ప్రాంతాల్లో సంస్థకు మంచి ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే, ‘బై నౌ పే లేటర్’, బెలూన్ ఈఎంఐ, స్టెప్ అప్ ఈఎంఐ వంటి స్కీమ్‌లతో వినియోగదారులు లబ్ది పొందుతున్నారని చెప్పారు. ఇరు సంస్థల భాగస్వామ్యం స్వయం ఉపాధి, వేతన జీవులు, రైతులు, వ్యాపారా వర్గాల వారికి ఎంతో మేలు కలుగుతుందని వెల్లడించారు. మారుతీ సుజుకి ఇండియాకు దేశంలో మొత్తం 3,086 షోరూమ్‌లు ఉండగా, మహీంద్రా ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా 1,450 శాఖలున్నాయి.

Next Story

Most Viewed