ఎమ్మెల్యే రాజ‌య్యకు ఏనుమాముల మార్కెట్ వైస్ చైర్మన్ కృత‌జ్ఞత‌లు

by  |
ఎమ్మెల్యే రాజ‌య్యకు ఏనుమాముల మార్కెట్ వైస్ చైర్మన్ కృత‌జ్ఞత‌లు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఏనుమాముల మార్కెట్ నూత‌న వైస్ చైర్మన్‌గా నియ‌మితులైన కాలేరు క‌ర‌మ్‌చందు శుక్రవారం ఎమ్మెల్యే రాజ‌య్యను హ‌న్మకొండ‌లోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. మార్కెట్ వైస్ చైర్మన్‌గా అవ‌కాశం క‌ల్పించినందుకు ఎమ్మెల్యేకు కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఎమ్మెల్యే రాజ‌య్యకు పుష్పగుచ్ఛం అంద‌జేసి శాలువాతో స‌న్మానించారు. ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి గ్రామానికి చెందిన క‌ర‌మ్‌చందు గ‌తంలో వైస్ ఎంపీపీగా కూడా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే రాజ‌య్యకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ఆయ‌న‌కు వైస్ చైర్మన్ ప‌ద‌వి ద‌క్కడంతో ధ‌ర్మసాగ‌ర్ టీఆర్ఎస్‌ వ‌ర్గాల్లో హ‌ర్షం వ్యక్తమ‌వుతోంది.

Next Story

Most Viewed