ఏపీలో ఎలక్ర్టిక్ ​వాహనాల తయారీ

by  |
ఏపీలో ఎలక్ర్టిక్ ​వాహనాల తయారీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో రూ.1,750 కోట్లతో ఎలక్ర్టిక్ గోల్ఫ్​ కార్డులతో పాటు బ్యాటరీల మార్పిడి ​యూనిట్ ​నెలకొల్పనున్నట్లు కెనెటిక్ ​గ్రీన్ ​సీఈఓ సులజ్జా ఫిరోదియా మొత్వానీ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ కార్గో 3 వీలర్‌ సఫర్‌ జంబో వాహనాన్ని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. గోల్ఫ్‌ కార్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం సెజ్‌లో యూనిట్‌ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. సెజ్‌లో యూనిట్‌తో పాటు ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల బ్యాటరీల మార్పిడికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్‌ గోల్ఫ్‌కార్టుల తయారీకి టొనినో లంబోర్గినితో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ​ఆటో రిక్షాలకు దేశంలో గిరాకీ లేదని ఆమె తెలిపారు. బ్యాటరీల మార్పిడి సదుపాయాన్ని తీసుకొస్తే హై స్పీడు త్రీవీలర్లకు డిమాండ్​ పెరిగే అవకాశం ఉందన్నారు.


Next Story

Most Viewed