విగ్గు‌ పెట్టుకుని 9 మందితో సహజీవనం.. చివరికి పోలీసుల ట్విస్ట్..!

by  |
విగ్గు‌ పెట్టుకుని 9 మందితో సహజీవనం.. చివరికి పోలీసుల ట్విస్ట్..!
X

దిశ, జూబ్లీహిల్స్: ఒకే ఒక విగ్గు పెట్టుకుని ఏకంగా 9 మంది అమ్మాయిలతో సహజీవనం చేశాడో కామాంధుడు. చివరకు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు చూపెట్టి బంగారు అభరణాలు లాక్కున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్సార్ నగర్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు.

సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ అలియాస్ కార్తీక వర్మ (29) హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. తాను చాలా రిచ్, పుట్టి పెరిగింది మొత్తం యూఎస్ఏలో, మదర్ ఓ డాక్టర్, నాన్న అమెరికాలో బిజినెస్ మ్యాన్ అంటూ యువతులను నమ్మించేవాడు. ఇంగ్లీష్‌లో నాలుగు మాటలు మాట్లాడి ఏకంగా 9 మందిని ట్రాప్ చేశాడు. శారీరకంగా అనుభవించి, మోజు తీరాకా వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేవాడు.

కాజేసిన బంగారం వివరాలు..

మొదటి యువతి వద్ద నుంచి 3.9 తులాలు
రెండవ యువతి వద్ద 2.4 తులాల నెక్లెస్
మూడవ యువతి వద్ద 2.1 తులం చైన్
నాల్గవ యువతి వద్ద 1.8 తులాలు
ఐదవ యువతి వద్ద 3 తులాలు
ఆరవ యువతి వద్ద 1.4 మెడలోని చైన్
ఏడవ యువతి వద్ద 2.9 తులాలు జత గాజులు
ఎనిమిదివ యువతి వద్ద మెడలోని చైన్
తొమ్మిదవ యువతి వద్ద రెండు సెల్ ఫోన్లును కాజేసి తప్పించుకు తిరగుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిఘా వేసి అదుపులోకి తీసుకున్నట్టు సీఐ సైదులు వివరించారు.

పెళ్లి చేసుకున్నాడు కానీ.. అంతకుముందే నా భర్త నన్ను రేప్ చేశాడు: నటి ఫిర్యాదు

Next Story

Most Viewed