మైండ్ బ్లాక్ చేసిన బ్లైండ్ డేట్!

by  |
మైండ్ బ్లాక్ చేసిన బ్లైండ్ డేట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి ‘లేఖ’ల యుగంలో.. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలేఖలతోనే కాలం గడిపే ప్రేయసీ ప్రేమికుల గురించి చాలా విన్నాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా చాటింగ్ చేసే ప్రేమికులూ ఉన్నారు. ఇక డేటింగ్ యాప్స్‌లో ఇలాంటి లవర్స్‌కు కొదువే లేదు. అలాంటి ఓ ప్రేమ జంట.. ‘బ్లైండ్ డేట్’‌కు వెళ్లారు. అందుకోసం ఓ మంచి హోటల్‌ను ఎంచుకున్నారు. ప్రేయసి కంటే ముందే అక్కడికి చేరుకున్న ప్రియుడు.. తన ప్రేయసిని ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్న తరుణంలో ఆమె కూడా వచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా, ఓ గంట తర్వాత ఆ హోటల్ వాళ్లు ఇచ్చిన బిల్లు చూసిన ప్రియుడు.. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు? ఇంతకీ అక్కడేం జరిగింది?

జెజియంగ్ ప్రావిన్స్‌కు చెందిన 29 ఏళ్ల ల్యూ.. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ల్యూ ప్రేమకు ఓకే చెప్పడంతో ఇద్దరూ కలిసి డేట్‌కు వెళ్లాలనుకున్నారు. అందుకోసం ఓ డేట్ ఫిక్స్ చేసుకుని, డెస్టినేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక డేటింగ్ రోజున తన ప్రేయసిని మొదటిసారి చూడబోతున్నాననే ఎగ్జైట్‌మెంట్‌తో రెస్టారెంట్‌కు వెళ్లాడు ల్యూ. ఇంతలో ల్యూ ప్రియురాలు తన స్నేహితులు, ఆత్మీయులను తీసుకుని రెస్టారెంట్‌లో అడుగుపెట్టింది. చేసేదేం లేక ల్యూ అందరితోనూ హ్యాపీగా గడిపాడు. ఇక అందరూ కలిసి అక్కడే కడుపు నిండా తిన్నాక.. అసలు కథ మొదలైంది. వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి ల్యూకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ బిల్లు అక్షరాల 19800 యునాన్లు (మన కరెన్సీలో రూ.2 లక్షల 17 వేలు). దాంతో ల్యూ అక్కడి నుంచి పారిపోయాడు. చివరకు ఆ అమ్మాయే తన బిల్లును చెల్లించింది. ఈ ఘటన తర్వాత ఆ యువతి సదరు యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ యువకుడు మాత్రం కేవలం రెండు టేబుళ్ల బిల్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.

ఈ సంఘటన పట్ల చాలామంది చైనా నెటిజన్లు ల్యూ మీద సింపతీ చూపిస్తున్నారు. ‘ఇది చాలా దారుణం’ అని అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు ఆ మహిళ ఇలా చేయడం ‘షేమ్‌లెస్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ.. ఓ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని, ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.



Next Story

Most Viewed