ప్లాస్మా దానం పేరిట మోసం

by  |
ప్లాస్మా దానం పేరిట మోసం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సోషల్ మీడియా వేదికగా మాయ మాటలు చెప్పి, డబ్బు లాగుతున్న నకిలీ ప్లాస్మా డోనర్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజం ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ (25) పలు దొంగతనాల కేసుల్లో విశాఖ జిల్లాలో జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చాక ప్రస్తుత కరోనా పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ప్లాస్మా డొనేట్ చేస్తానంటూ సోషల్‌మీడియాలో పలువురిని ఆకర్షించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండగా హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ జి. చక్రవర్తి నేతృత్వంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్లాస్మా డోనర్ పేరుతో, కొవిడ్ పాజిటివ్ పేషెంట్లకు వినియోగించే యాంటీ వైరల్ డ్రగ్ టోసిలిజుంబ్ 400 ఎంజీ సరఫరా చేస్తానంటూ దాదాపు 200మంది నుంచి భారీ ఎత్తున డబ్బు లాగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియా వేదికగా చాటింగ్ చేసిన సందీప్ నన్ను ఎవరూ పట్టుకోలేరంటూ పలువురితో చాలెంజ్ చేశాడు. వారం తిరక్కముందే పోలీసులకు చిక్కాడు.

Next Story

Most Viewed