మహారాష్ట్రలో కరోనా మందు క్లినికల్ ట్రయల్స్!

by  |
మహారాష్ట్రలో కరోనా మందు క్లినికల్ ట్రయల్స్!
X

ముంబై: కరోనా విజృంభణతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్ర త్వరలో రెమెదెసివిర్ డ్రగ్‌కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. దీనికోసం కసరత్తులు మొదలయ్యాయి. 14 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సిద్ధమైంది. రెమెదెసివిర్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ కోసం మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ డైరెక్టరేట్(డీఎంఈఆరు) హెడ్ డాక్టర్ టీపీ లహానే ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక చేసిన హాస్పిటళ్ల ఎథిక్స్ కమిటీ ఈ మేరకు అనుమతులివ్వాలని డీఎంఈఆర్ ఆదేశించింది. కాగా, రెమెదెసివిర్ డ్రగ్‌ను సరఫరా చేసేందుకు సంబంధిత కంపెనీల కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం తీసుకోవాలని కొన్ని ఆస్పత్రులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మొత్తంలో ఈ డ్రగ్‌ను సేకరించి 18 బోధనాస్పత్రులకు అందించనుంది. కేవలం అత్యవసర స్థితిలో మాత్రమే కుటుంబీకుల అనుమతితో ఈ డ్రగ్‌ను పేషెంట్‌కు అందించనున్నారు. ట్రయల్స్ కోసం బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, హెటిరో కంపెనీలు ఉచితంగా ఈ డ్రగ్‌ను అందించనున్నట్టు సమాచారం. కరోనాను ఎదుర్కోవడంలో రెమెదెసివిర్ డ్రగ్ ప్రభావవంతంగా పనిచేస్తున్నదన్న పేరున్నది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed