షాకింగ్.. కరోనా టీకాకు బదులు రేబిస్ వ్యాక్సిన్.. ఆ తర్వాత ఏమైందంటే..

by  |
షాకింగ్.. కరోనా టీకాకు బదులు రేబిస్ వ్యాక్సిన్.. ఆ తర్వాత ఏమైందంటే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులు వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన వారితో కిటకిటలాడుతున్నాయి. అయితే, ఓ ఆసుపత్రిలో అనూహ్యంగా కరోనా వ్యాక్సిన్‌‌తో పాటు.. రేబిస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కూడా క్యూ కట్టారు.

అది తెలియక రాజు కుమార్ అనే వ్యక్తి కరోనా టీకా లైన్‌కి బదులు రేబిస్ వ్యాక్సిన్ లైన్‌లో నిలుచున్నాడు. దీంతో, వైద్య సిబ్బంది అతడిని అడగకుండానే.. సదరు వ్యక్తికి రేబిస్ ఇంజక్షన్ ఇచ్చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో కల్వా ఆరోగ్య కేంద్రానికి రాజ్ కుమార్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చారు. పొరపాటున రేబిస్ టీకా వేసే లైన్‌లో నిల్చోవడంతో.. వైద్య సిబ్బంది అతడికి రేబిస్ టీకా ఇచ్చేశారు.

అంతా అయిపోయాక అధికారులకు చెప్పడంతో అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షించారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆసుపత్రి ఇంచార్జి, నర్సును సస్పెండ్ చేశారు.



Next Story

Most Viewed