ఈజీ మనీ కోసమే కిడ్నాప్ : ఎస్పీ

by  |
ఈజీ మనీ కోసమే కిడ్నాప్ : ఎస్పీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గతకొన్ని రోజుల క్రితం బాలుడు దీక్షిత్ కిడ్నాప్ చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. అయితే బాలుడి మృతదేహాన్ని గురువారం మహబూబాబాద్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ గుట్టపై పోలీసులు గుర్తించారు. అనంతరం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై గురువారం మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

త్వరగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతోనే బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్‌లు మరో ఇద్దరితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు సమయంలో దుండగులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేశారని గుర్తుచేశారు. తెలిసిన వాళ్లు కావడంతో దీక్షిత్ బైక్ ఎక్కి ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. అదే రోజు రాత్రి 9 గంటలకు కిడ్నాపర్లు విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు తమకు(పోలీసులకు) సమాచారం అందించారని అన్నారు. కిడ్నాప్ తర్వాత బాలుడి తల్లిదండ్రుల నుంచి రూ.45 లక్షలు డిమాండ్ చేశారని తెలిపారు.

అంతేగాకుండా దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన గంటలోపే గొంతు నులిమి చంపారని, దొరికిపోతామనే భయంతో హత్య చేశారని వెల్లడించారు. తమకు కూడా బాలుడిని హత్య చేసినట్టు ఒక గంట క్రితమే తెలిసిందని అన్నారు. నిందితులు వాడిన టెక్నాలజీ ఆధారంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ కేసులో మొత్తం 24 మందిని విచారించామని స్పష్టం చేశారు. ఒక పోలీసు అధికారిగా కాకుండా, వినడానికి తనకూ ఇబ్బందిగా ఉందని ఎస్పీ కోటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా బాలుడ్ని చంపిన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కోటిరెడ్డి తేల్చిచెప్పారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed